గాజువాక, చైతన్యవారధి:
జీవీఎంసీ 65 వ వార్డు పరిధిలో గల కాకతీయ జంక్షన్ వధ్ద గల స్వర్గీయ డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద జిల్లా వైఎస్సార్ సీపీ మహిళా నాయకురాలు, వెంబో కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షురాలు మంత్రి మంజుల నేతృత్వంలో రాజ్యసభ సభ్యులు డాక్టర్ విజయ సాయి రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు 74 వ వార్డు వైఎస్సార్ సీపీ అభ్యర్థి తిప్పల వంశీ రెడ్డి, 76 వార్డు వైఎస్సార్ సీపీ అభ్యర్థి దొడ్డి రమణ, 66 వార్డు వైఎస్సార్ సీపీ అభ్యర్థి మహమ్మద్ ఇమ్రాన్ హాజరయ్యారు. వార్డు నాయకులతో కలిసి కేక్ కట్ చేసి విజయసాయి రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు.