18, అక్టోబర్ 2010, సోమవారం
రబీకి రూ.3 వేల కోట్ల సహకార రుణాలు
హైదరాబాద్: వచ్చే రబీకి రూ.3 వేల కోట్ల సహకార రుణాలు ఇచ్చే లక్ష్యంగా పనిచేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్, సహకార శాఖలపై సచివాలయంలో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుజాగ్రత్తగా అవసరమైన మేర ఏడాదిపాటు ప్రైవేటు గోదాముల్ని అద్దెకు తీసుకోవాలని సీఎం సూచించారు. 11 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యమున్న గిడ్డంగుల నిర్మాణాల్ని 9 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈనెలాఖరులోగా చీపురుపల్లి, కుప్పంలలో గ్రామీణ సహకార ఎన్నికలు నిర్వహించనున్నట్లు మంత్రి రామిరెడ్డి తెలిపారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
వ్యాఖ్యలను పోస్ట్ చేయి (Atom)
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి