విశాఖపట్నం: రాష్ట్రానికి మరో అల్పపీడన ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటివరకు తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీరం దాటి పారాదీప్వైపు తరలిపోవటంతో పెద్ద ముప్పు తప్పింది. అయితే రాగల 48 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీనివల్ల కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తెలంగాణ, రాయలసీమల్లో చెదురుముదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి