Loading...

11, అక్టోబర్ 2010, సోమవారం

సచిన్ టెండూల్కర్ 49వ టెస్టు మ్యాచ్ సెంచరీ

బెంగుళూరు: ఆస్ట్రేలియాతో బెంగుళూరులో జరుగుతున్న రెండవ టెస్టు ఆటలో భారత స్టార్ బ్యాట్స్ మెన్ మాస్టర్ బ్లాస్టర్సచిన్ టెండుల్కర్ సెంచరీ చేశాడు. దీంతో ఒక క్యాలెండర్ ఇయర్లో 6 సెంచరీలు చేసిన మొదటి వ్యక్తి కూడా సచినే అయ్యాడు. బెంగుళూరులో సచిన్ కు ఇది మొదటి టెస్టు సెంచరీ. సెంచరీతో టెస్టుల్లో తన 49 సెంచరీ పూర్తి చేసుకొని ఆర్ధ సెంచరీలసెంచరీకి మరో అడుగు దూరంలో ఉన్నాడు. సచిన్ టెస్టుల్లో 14వేల పరుగుల మైలురాయిని దాటిన విషయం తెలిసిందే. కాగా బెంగుళూరులో మరో సెంచరీ చేస్తే సునీల్ గవాస్కర్, మహ్మద్ అజారుద్దీన్ సరసన బెంగుళూరులో రెండు సెంచరీలుచేసిన వాడవుతాడు. అస్ట్రేలియాపై సచిన్ కు ఇది 11 సెంచరీ. సచిన్ 160 బంతులలో 106 పరుగులు చేశాడు. ఇందులోఫోర్లు, 2 సిక్స్లు ఉన్నాయి.
15

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి