Loading...

13, అక్టోబర్ 2010, బుధవారం

సరస్వతిదేవి అలంకారంలో దుర్గమ్మ

విజయవాడ : మూలా నక్షత్రం సందర్భంగా కనకదుర్గమ్మ సరస్వతిదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. వీణావాదం చేస్తూ, పుస్తకం ధరించి అమ్మవారు భక్తులకు కనువిందు చేస్తున్నారు. దుర్గమ్మ జన్మనక్షత్రమైన మూల నక్షత్రంలో సరస్వతి రూపిణీ అయిన అమ్మను దర్శిస్తే సకల జ్ఞాన సంపద కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. ముఖ్యమంత్రి రోశయ్య నేడు అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి