Loading...

18, అక్టోబర్ 2010, సోమవారం

ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న భక్తుల రద్దీ

విజయవాడ: దేవీ నవరాత్రి మహోత్సవాలు ముగిసినా ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. దుర్గమ్మకు మొక్కులు తీర్చుకోడానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భవానీ దీక్షాపరులు తరలివస్తున్నారు. జైదుర్గ.. జైభవానీ నామస్మరణతో వేదమాతను దర్శించుకుని దీక్షలు విరమిస్తున్నారు. నిన్నటి వరకూ పనిచేసిన కొన్ని ప్రసాదం కౌంటర్లు ఈ రోజు మూసివేయడంతో ప్రసాదాల కోసం భక్తులు బారులు తీరారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి