7, అక్టోబర్ 2010, గురువారం
సెలవులను సద్వినియోగం చేసుకోవాలి
ఇంటర్మీడియట్, పదవ తరగతి, డీగ్రీ పరీక్షలు ఒకటోకటిగా ముగిశాయి. కళాశాలలకు, ఉన్నత పాఠశాలలకు వేసవి సెలవులు ఇచ్చేశారు. జూన్ వరకు రెండు నెలల పాటు ఈ సెలవులు ఉంటాయి. విద్యార్థులు ఏడాది పాటు తరగతి గదుల్లో కూర్చొని పుస్తకాలతో కుస్తీలు పట్టి ఆలసి పోయి ఉంటారు. ఈ ఆలసట, ఒత్తిడి నుంచి బయట పడటానికి విద్యార్థులు సెలవుల్లో సేద తీరడం అవసరమే. అయితే సెలవుల్లో రోజు మొత్తాన్ని ఆట, పాటలతో గడిపి వృథా చేస్తే తర్వాత వ్యద చెందక తప్పదు. నేటి పోటీ ప్రపంచంలో ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులు పలు రంగాల్లో వెనుక బడి ఉంటున్నారు. ముఖ్యంగా తెలుగు మాద్యమంలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందుకోవడంలో వెనుకబడుతున్నారు. ప్రస్థుత పోటీ ప్రపంచంలో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే వార్షిక విద్యార్హతలతో పాటు అదనపు నైపుణ్యాలు సంపాధించుకోవడం అవసరం. ఈ రోజుల్లో ఏ ఉద్యోగానికైనా కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీషు ప్లూయెన్సీ, కంప్యూటర్ పరిజ్ఞానం అవసరమవుతున్నాయి. గ్రామీణ విద్యార్థులు ఈ సెలవులును సద్వీనియోగం చేసుకుని ఈ అంశాలలో నైపుణ్యాన్ని సంపాదించుకుంటే భవిష్యత్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సులభంగా చేజిక్కించుకోవచ్చు. విద్యార్థులు ఆ దిశగా ఆలోచించి అదనపు నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి చర్యలు తీసుకోవాలి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
వ్యాఖ్యలను పోస్ట్ చేయి (Atom)
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి