Loading...

22, అక్టోబర్ 2010, శుక్రవారం

వర్మపై లక్ష్మిపార్వతి నిప్పులు...

సినిమావారధి: రక్తచరిత్ర సినిమాలో రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ పాత్రను చిత్రీకరించిన తీరుపై ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను కోర్టుకెక్కుతానని ఆమె చెబుతున్నారు. పరిటాల రవి తెలుగుదేశం పార్టీలోకి రావడానికి ముందు చాలా కష్టాలు పడ్డారని ఆమె చెప్పారు. పార్టీలోకి రావడానికి ముందు పరిటాల రవి చాలా ఇబ్బందులు పడ్డారని ఆమె అన్నారు. తానే పరిటాల రవిని పిలిపించానని, అన్నీ మాట్లాడిన తర్వాతనే పార్టీలో చేర్చుకున్నామని ఆమె చెప్పారు. పాత్ర చిత్రీకరణలో వర్మ కనీస మర్యాద కూడా పాటించలేదని ఆమె అంటున్నారు. వర్మను ఆమె చండాలుడిగా అభివర్ణించారు. వర్మకు ధైర్యం ఉంటే తనతో మాట్లాడాలని ఆమె సవాల్ చేశారు. రామ్ గోపాల వర్మ నీచుడని ఆమె అన్నారు. తాను సినిమా చూడబోనని చెప్పారు. మొత్తం మీద, ఎన్టీఆర్ పాత్ర చిత్రీకరణపై తెలుగుదేశం పార్టీ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్టీఆర్ మర్డర్ చేయించడానే పద్ధతిలో వర్మ చిత్రించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి