Loading...

25, అక్టోబర్ 2010, సోమవారం

అతి పెద్ద కోడి గుడ్డు

తూర్పుగోదావరి జిల్లా : తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు గ్రామంలోని ముకుందరెడ్డి పౌల్ట్రీలో ఆదివారం ఒక కోడి పెద్ద గుడ్డు పెట్టింది. దాని బరువు 138 గ్రాములు ఉంది. సాధారణ కోడి గుడ్డు బరువు 52 గ్రాములు ఉంటుంది. అలాగే రెండు సొనలు ఉంటే 75 గ్రాముల వరకు ఉంటుంది. కాని ఇది ఏకంగా 138 గ్రాముల గుడ్డు పెట్టడం విశేషం. ఈ కోడి వయసు 55 వారాలని ఫారమ్‌ యజమానులు ఎం.సూరారెడ్డి, పి.వేణుసుధాకరరెడ్డిలు తెలిపారు. ఎస్‌.హెచ్‌. ఫాలిక్యులర్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌ అధికంగా ఉండటం వల్ల ఇలాంటి గుడ్లు ఉత్పత్తవుతాయని పశుసంవర్థక శాఖ అధికారులు అంటున్నారు. ఈ గుడ్డులో ఒక అండానికి బదులుగా 4, 5 అండాలు ఒకేసారి విడుదల కావటం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతాయన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి