హైదరాబాద్: భారత సొగసరి బ్యాట్స్‌మెన్ వి.వి.ఎస్ లక్ష్మణ్‌పై ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ ఆడమ్‌గిల్‌క్రిస్ట్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆస్ట్రేలియాకు చెందిన ఓ విశ్వవిద్యాలయానికి ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చిన గిల్ మీడియాతో మాట్లాడారు. ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లు రసవత్తరంగా ఉన్నాయన్నారు. భారత జట్టులో సచిన్ సెహ్వాగ్‌లతోపాటు లక్ష్మణ్సైతం బలంగా ఉన్నాడని చెప్పారు. అంపైర్ల రిఫరల్ విధానంపై మాట్లాడుతూ అన్ని జట్ల కెప్టెన్లతో ప్రత్యేకంగా చర్చించి నూతన విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని అభిప్రాయపడ్డారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి