25, అక్టోబర్ 2010, సోమవారం
త్వరలో సరికొత్త కామసూత్ర
లండన్: ప్రాచీన కామసూత్ర గ్రంథాన్ని భారతీయ మేధావి ఏఎన్డీ హక్సర్ ఆధునిక రీతిలో తిరగ రాశారు. ఆధునిక జీవితాలు, అనుబంధాలకు అనుగుణంగా, కొత్తతరం స్త్రీపురుషులకు జీవనశైలీ మార్గదర్శిగా ఈ కామసూత్రను తీర్చిదిద్దారు. 2011లో పెంగ్విన్ పబ్లిషర్ల ద్వారా ఈ పుస్తకం విడుదలవనుంది. పాకెట్సైజ్లో రూపొందిస్తున్న ఈ కొత్త గ్రంథంలో బొమ్మలేవీ ఉండవు. సంస్కృత గ్రంథాలను ఆంగ్లానువాదం చేసే రచయిత హక్సర్ ఆధునిక కామసూత్రలో అధ్యాయాల పేర్లనూ నేటితరం శైలికి అనుగుణంగా పెట్టినట్లు 'సండే టెలిగ్రాఫ్' తన ప్రివ్యూలో వెల్లడించింది. 'సాధారణంగా కామసూత్ర అంటే శృంగార గ్రంథమనే భావన మనలో బలపడిపోయింది. కానీ.. ఇది జీవనశైలి, సామాజిక సంబంధాలను తెలిపే పుస్తకం' అని హక్సర్ తెలిపారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
వ్యాఖ్యలను పోస్ట్ చేయి (Atom)
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి