Loading...

22, అక్టోబర్ 2010, శుక్రవారం

రక్త చరిత్రపై ఆగ్రహజ్వాలలు...


హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ రక్తచరిత్రపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తుతోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీఆర్ పాత్ర చిత్రీకరణపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళనలకు దిగుతున్నారు. కొన్ని చోట్ల ఆందోళనకారులపై లాఠీచార్జీలు కూడా జరిగాయి. వర్మకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అనంతపురంలో కృష్ణా థియేటర్ వద్ద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ధర్నా చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు స్వల్పంగా లాఠీచార్జీ ఆందోళనకారులను అరెస్టు చేశారు. అనంతపురం జిల్లా హిందూపురంలో కూడా వర్మకు వ్యతిరేకంగా నిరసన పెల్లుబుకింది. విజయవాడలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. విజయవాడలోని రక్తచరిత్ర ప్రదర్శిస్తున్ని సినిమా థియేటర్లు ఖాళీగా ఉన్నాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి