తిరుమల : తిరుమలలో బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద ఓ లారీ అదుపు తప్పి డివైడర్‌పైకి దూసుకెళ్లింది. దాంతో డివైడర్‌పైన నడుస్తున్న భక్తులపైకి దూసుకువెళ్లటంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. గాయపడిన ఓ వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. లారీ బ్రేకులు ఫెయిల్ కావటమే ఈ ప్రమాదానికికారణమని సమాచారం.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి