Loading...

13, అక్టోబర్ 2010, బుధవారం

మైక్రో సంస్థలపై పోలీసు చర్యలు

హైదరాబాద్‌ : రుణాల వసూలు కోసం వేధింపులకు పాల్పడే సూక్ష్మరుణ సంస్థలపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు శాఖను ఆదేశించినట్లు మంత్రులు గీతారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, శ్రీధర్‌బాబు తెలిపారు. మంత్రులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి సూక్ష్మరుణ సంస్థల ఆగడాలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని కోణాల్లో ప్రణాళికలను సిద్ధం చేస్తోందని వెల్లడించారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సలహాలు, సూచనలు తీసుకోవటం తప్పుకాదన్నారు. ప్రతిపక్షనేతగా చంద్రబాబు రైతులకు మనోధైర్యం పెంచేలా మాట్లాడాలి తప్ప రెచ్చగొట్టే వ్యాఖ్యలు తగవని హితవు పలికారు. ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి సీపీఐకి లేదని మండిపడ్డారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి