13, అక్టోబర్ 2010, బుధవారం
ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం
బెంగళూరు : ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. రెంటు టెస్టుల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఏడు వికెట్ల నష్టానికి 202 పరుగులతో ఐదో రోజు ఆటను ప్రారంభించిన ఆసిస్ మరో 21 పరుగులు జోడించి 223 పరుగులకు ఆలౌటయింది. అనంతరం 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 3 వికెట్లను కోల్పోయి విజయాన్ని సాధించింది. పుజారా 72, సచిన్ 53, విజయ్ 37, డ్రావిడ్ 21 సెహ్వాగ్ 7 పరుగులు చేశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ టైటిళ్లను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కైవసం చేసుకున్నాడు. ఈ విజయంతో తొలిసారిగా భారత్ ఆస్ట్రేలియాను టెస్టుల్లో క్లీన్స్వీప్చేసింది. చిన్నస్వామీ స్టేడియంలో ఆస్ట్రేలియాపై భారత్‌కిది తొలి విజయం కాగా, సొంతగడ్డపై ఆసిస్‌ను 15వ సారి ఓడించింది. ఓటమితో టెస్టుల్లో ఆసిస్ ఐదో స్థానానికి పడిపోయింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
వ్యాఖ్యలను పోస్ట్ చేయి (Atom)
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి