తిరుపతి: రాష్ట్రంలోని ముఖ్యపట్టణాల్లో హైకోర్టు బెంచ్‌లను ఏర్పాటు చేయాలన్న న్యాయవాదుల న్యాయమైన కోర్కెను పరిష్కరించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని తెలుగుదేశం పార్టీ సీనియర్‌నేత
గాలి ముద్దుకృష్ణనాయుడు అన్నారు. తిరుపతిలో న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహారదీక్షా శిబిరాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. దేశంలోనే విస్తీర్ణం, జనాభా పరంగా ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందని, అయినా అన్ని రాష్ట్రాల్లో మాదిరిగా ఇక్కడ హైకోర్టు బెంచ్‌లు ఏర్పాటుకు నోచుకోకపోవడం దారుణమన్నారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి