18, అక్టోబర్ 2010, సోమవారం
న్యాయవాదుల ఆమరణ నిరాహారదీక్ష
కృష్ణా: విజయవాడ-గుంటూరు మధ్య హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని బెజవాడ బార్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. గత 15రోజులుగా విజయవాడ కోర్టుల ప్రాంగణంలో న్యాయవాదుల రిలేదీక్షలు చేపడుతుండగా, ఈ రోజు నుంచి ఇద్దరు న్యాయవాదులు ఆమరణ దీక్షకు దిగారు. దీక్ష ప్రారంభించిన కృష్ణమూర్తి, సుబ్బారావులకు తోటి న్యాయవాదులు సంఘీభావం తెలిపారు. హైకోర్టు బెంచి ఏర్పాటుతో కోస్తాజిల్లాల ప్రజలకు హైదరాబాద్ వరకూ రవాణా ఖర్చులు తగ్గటంతో పాటు కేసుల త్వరగా పరిష్కారం అవుతాయని బీబీఏ న్యాయవాదులు తెలిపారు. 1956 పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం బెంచి ఏర్పాటు చేయాల్సి ఉన్నా ప్రభుత్వం తాత్సారం చేస్తోందని న్యాయవాదులు విమర్శించారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
వ్యాఖ్యలను పోస్ట్ చేయి (Atom)
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి