నెల్లూరు: రాష్ట్రంలో మైక్రోఫైనాన్స్ వ్యాపారాన్ని నిషేధించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. ఆయన ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. సూక్ష్మరుణ సంస్థల వేధింపులతో ఆత్మహత్య చేసుకుంటే యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆయన అన్నారు. మైక్రోఫైనాన్స్ను నిషేధించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి