Loading...

9, అక్టోబర్ 2010, శనివారం

రైల్వే జీఎంను అడ్డుకున్న అఖిలపక్షం

విశాఖపట్నం : తూర్పుకోస్తా రైల్వే జీఎం ఏకే వోరాను అఖిలపక్ష నేతలు అడ్డుకున్నారు. నగరంలో రైల్వేస్టేషన్‌ ప్రాంగణంలో రిజర్వేషన్‌ కౌంటర్‌ను ప్రారంభించిన సందర్భంగా అక్కడికి విచ్చేసిన అఖిలపక్షనేతలు ఆయన్ను రైల్వేసమస్యలపై నిలదీశారు. దువ్వాడనుంచి తరలిపోతున్న రైళ్ల గురించి ఆందోళనకారులు ఆయన్ను నిలదీశారు. నేతలను నివారించేందుకు రైల్వేపోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. చివరకు జీఎంను పోలీసులు దూరంగా తీసుకువెళ్లారు. విశాఖకు రైల్వేజోన్‌ సాధించేంతవరకు అఖిలపక్షనేతలు స్పష్టం చేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి