
చైతన్యవారధి: పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే, వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సంస్థ మేనేజింగ్ డైరక్టర్ మళ్ల విజయ్ప్రసాద్కు తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియా(తామ్) ఉత్తమ యువ పారిశ్రామికవేత్త పురస్కారాన్ని ప్రదానం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆయా రంగాల్లో ఉత్తమ ప్రతిభకనబరిచిన తెలుగువారికి దీనిని అందజేస్తారు. మలేషియాలోని పుత్రాజయ ఇంటర్నేషనల్ కన్వెనెన్స్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ దేశ ప్రధాని మహ్మద్ నజీబ్ బిన్ తున్ హజీ అబ్దుల్‌రజాక్ చేతులమీదుగా విజయ్‌ప్రసాద్ ఈ అవార్డు అందుకున్నారు. కాగా 2008లో అమెరికాలోని వెస్ట్‌బ్రూక్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్, జాతీయ మానవహక్కుల కమిషన్ 'ఉత్తమ మానవతావాది' పురస్కారం, ఇంటర్నేషనల్ బిజినెస్ ప్రొడక్టవిటీ ఫోరం 'ఉత్తమ వ్యాపారవేత్త' అవార్డు వంటివి విజయ్‌ప్రసాద్‌ను వరించాయి.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి