Loading...

11, అక్టోబర్ 2010, సోమవారం

మంత్రివర్గంలో చేరికపై ఎలాంటి చర్చ జరగలేదు : చిరంజీవి

హైదరాబాద్‌ : ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని సూక్ష్మరుణ సంస్థలు వారిని బలితీసుకుంటున్నాయని ప్రరాపా అధినేత చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. సూక్ష్మరుణ సంస్థలపై ఎలాంటి చర్యలు చేపట్టని ప్రభుత్వాన్ని చూస్తుంటే.. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అన్న అనుమానం కలుగుతోందని అన్నారు. నంది అవార్డులపై ఇటీవల చోటుచేసుకున్న వివాదాలపై స్పందిస్తూ అలాంటివాటికి తాను అంత ప్రాముఖ్యత ఇవ్వనన్నారు. అవార్డులపై అసంతృప్తి రేగడం సమంజసం కాదని, దీన్ని జ్యూరీ నిర్ణయానికి వదిలివేస్తున్నట్లు చెప్పారు. మంత్రివర్గంలో చేరుతున్నారా అన్న ప్రశ్నకు దానిపై పార్టీలో ఎలాంటి చర్చ జరగలేదని, ఎవరి నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదని అన్నారు. తాను నటించబోయే సినిమాకు ఇంకా కథ నిర్ణయం కాలేదని, కథకు అనుగుణంగానే పేరు ఉంటుందని చెప్పారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి