Loading...

13, అక్టోబర్ 2010, బుధవారం

రాయపాటి క్రమశిక్షణ ఉల్లంఘించారు: అంబటి

గుంటూరు: రాష్ట్ర మంత్రివర్గంలో అవినీతిపరులైన మంత్రులున్నారంటూ గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు చేసిన ప్రకటన కూడా క్రమశిక్షణారాహిత్యం కిందకు వస్తుందని పీసీసీ బహిష్కృత నేత అంబటి రాంబాబు అన్నారు. ఈ వ్యాఖ్యల ద్వారా ముఖ్యమంత్రి సైతం అవినీతిపరుడనే అర్థం వస్తుందని ఆయన గుంటూరులో చెప్పారు. పార్టీ వేదికలపై ప్రస్తావించాల్సిన విషయాలను బయట మాట్లాడడం ద్వారా ఎంపీ రాయపాటి క్రమశిక్షణ ఉల్లంఘించారని... ఆయనకు కూడా పీసీసీ నోటీసు ఇవ్వాలని అంబటి డిమాండ్‌ చేశారు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి