హైదరాబాద్ : అక్రమాలకు పాల్పడే గ్యాస్ ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీ, ఎస్ఆర్ నగర్లో ఉన్న గ్యాస్ ఏజెన్సీల్లో మంత్రి ఆకస్మిక తనిఖీలు చేశారు. గ్యాస్ ఏజెన్సీల అక్రమాలను తమ దృష్టికి తీసుకువస్తే వాటి లైసెన్సులు రద్దు చేస్తామని తెలిపారు. త్వరలో తీసుకువచ్చే బయోమెట్రిక్ విధానంతో గ్యాస్ ఏజెన్సీల అక్రమాలను అరికడతామని చెప్పారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి