Loading...

8, అక్టోబర్ 2010, శుక్రవారం

శ్రీశైలంలో శరన్నవరాత్రి ఉత్సవాలు

శ్రీశైలం: అష్టాదశ శక్తిపీఠ సహితమైన శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు శ్రీభమరాంబదేవి ఆలయంలో శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. అర్చకులు, వేదపండితులు వేద మంత్రోచ్ఛారణలతో ఈ ఉత్సవాలు నిర్విఘ్నంగా జరగాలని అంకురార్పణ పూజలు చేశారు. తొమ్మిదిరోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భ్రమరాంబదేవి రోజూ వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఈ సాయంత్రం శైలపుత్రి అలంకారంలో భ్రమరాంబదేవి అలరించనున్నారు. శ్రీస్వామి అమ్మవార్లు భృంగీవాహనంపై గ్రామోత్సవంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి