నెల్లూరు: 'జల్' తుపాను తాకిడికి నెల్లూరు జిల్లాలో పది మంది మృత్యువాత పడ్డారు. అధికారికంగా నలుగురు మృతిచెందినట్లు ప్రకటించినా జిల్లా కలెక్టర్ కె. రాంగోపాల్ మిగిలిన మృతులపై ఆరా తీస్తున్నారు. గూడూరు, పెళ్లకూరు, మనుబోలు, తడ, కోట మండలాల్లో ఒక్కొక్కరు చొప్పున... అల్లూరులో ఇద్దరు, చిట్టమూరు మండలంలో ముగ్గురు మృతి చెందినట్లు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. చలికి తట్టుకోలేక వృద్ధులు మృత్యువాత పడుతున్నారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి