21, నవంబర్ 2010, ఆదివారం
23న జీవీఎంసీ ఉద్యోగుల మహాధర్నా
విశాఖపట్నం, నవంవర్ ౨౧(చైతన్యవారధి): ఆంధ్రప్రదేశ్ నాన్ గజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో 23న తలపెట్టిన 'చలో హైదరాబాద్' కార్యక్రమానికి తమ సంఘం మద్దతు తెలియజేస్తుందని జీవీఎంసీ గుర్తింపు యూనియన్ ప్రధాన కార్యదర్శి వి.వి.వామనరావు తెలిపారు. ఆ రోజున జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట మహా ధర్నా నిర్వహిస్తామని పేర్కొన్నారు. గుర్తింపు యూనియన్ కార్యాలయంలో అత్యవసర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. దీర్ఘకాలంగా ఉన్న డిమాండ్ల సాధనకు ఏపీఎన్జీఓ, జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 23న సామూహికంగా సెలవు పెడుతున్నట్లు ప్రకటించారు. ప్రధానంగా ఏడు డిమాండ్ల పరిష్కారం కోరుతూ నిరసన చేపడతామన్నారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు రమేశ్, డిప్యూటీ జనరల్ కార్యదర్శి రామనారాయణ, గౌరవ సలహాదారు పద్మనాభరాజు, ప్రచార కార్యదర్శి సీతారాం, వర్కింగ్ ప్రెసిడెంట్ ఈటి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
వ్యాఖ్యలను పోస్ట్ చేయి (Atom)
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి