21, నవంబర్ 2010, ఆదివారం
24న మెగా ఉద్యోగ మేళా
విశాఖపట్నం, నవంవర్ ౨౧(చైతన్యవారధి): రాజీవ్ ఉద్యోగశ్రీలో భాగంగా ఈ నెల 24న ఉదయం పది గంటలకు మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ప్రాంతీయ ఉపాధి కల్పనాధికారి షేక్ షిరీన్‌బేగం తెలిపారు. ఉపాధికార్యాలయం, ఐ.టి.ఐ. ప్రాంగణంలో ఈ మేళా జరుగుతుందన్నారు. సినర్జీస్ ఇండియా లిమిటెడ్, శివశంకర్ ఆటోమొబైల్స్, వరుణ్ మోటార్స్, ఫోర్బ్స్ లిమిటెడ్, వరల్డ్‌వైడ్ డైమండ్స్ లిమిటెడ్, విశాఖ టెక్నో సాఫ్ట్ సొల్యూషన్స్, బజాజ్ అలియాంజ్, కాప్సి (హైదరాబాద్) సంస్థలు దీనిని నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. వాషింగ్ బాయ్స్, డ్రైవర్లు, సేల్స్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ అడ్వయిజర్స్, కస్టమర్ రిలేషన్ మేనేజర్లు, సెక్యూరిటీ గార్డులు తదితర ఖాళీలను భర్తీ చేస్తాయన్నారు. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు, ఆయా పోస్టులను బట్టి ఐదో తరగతి నుంచి ఎంబీఏ, ఎంసీఏ పూర్తి చేసిన వారు అర్హులు. ఐ.టి.ఐ. మెకానికల్, ఇనుస్ట్రుమెంటేషన్, డిప్లొమా (ఎలక్ట్రికల్) చేసిన వారు కూడా అర్హులు. ఆసక్తిగలవారు పూర్తి బయోడేటా, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, అసలు ధ్రువపత్రాలు, వాటి నకళ్లుతో హాజరు కావాలని తెలిపారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
వ్యాఖ్యలను పోస్ట్ చేయి (Atom)
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి