21, నవంబర్ 2010, ఆదివారం
25న ఉచిత నేత్ర వైద్య శిబిరం
గాజువాక, నవంబర్ 21(చైతన్యవారధి) షీలానగర్ ఆయుర్వేద కృషి ఆస్పత్రిలో ఈ నెల 25న ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు విశాఖ డెయిరీ ఛైర్మన్ అడారి తులసీరావు తెలిపారు. అనువంశిక కారణాలతో క్రమేపి చూపుతగ్గిన చిన్నపిల్లలు, హస్వదృష్టి, దీర్ఘదృష్టి, 50 ఏళ్ల పైబడి చూపు మందగించినవారు, ఎలర్జీ కారణంగా తరుచూ కళ్లు ఎర్రబడడం, కంటిపాపలో నల్లటి మచ్చలు ఏర్పడడం తదితర వ్యాధులకు శిబిరంలో పరీక్షలు నిర్వహిస్తారన్నారు. 24వ తేదీ సాయంత్రంలోగా 0891-2516603 నంబరుకు ఫోన్చేసితమ వివరాలు రిజిష్టర్ చేయించుకోవాలని తులసీరావు కోరారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
వ్యాఖ్యలను పోస్ట్ చేయి (Atom)
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి