22, నవంబర్ 2010, సోమవారం
26 నుంచి విశాఖ మ్యూజిక్ అకాడమి వార్షికోత్సవాలు
విశాఖపట్టణం, నవంబరు21(చైతన్యవారధి): విశాఖ మ్యూజిక్ అకాడమి 41వ వార్షికోత్సవాల సందర్భంగా ఈనెల 26నుంచి డిసెంబరు 1 వరకు పిఠాపురంకాలనీలోని కళాభారతి ఆడిటోరియంలో ప్రత్యేక సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆదివారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో సభ్యుడు ఎస్.విజయ్‌కుమార్ వివరాలు వెల్లడించారు. 26న సాయంత్రం 'సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి పురస్కారాన్ని కర్ణాటక సంగీత విద్వాంసుడు ఎన్.విజయశివకు అందజేస్తారు. 27న 'సంగీతకళాసాగర' బిరుదును ఎ.కన్యాకుమారికి, 28న 'నాట్యసాగర అవార్డును' భరతనాట్యంలో ప్రావీణ్యం కలిగిన ఆనందశంకర జయంతికి ఇస్తారు. 29న మాండలిన్ శ్రీనివాస్‌కు సన్మానం, 30న ఎం.ఎస్.సుబ్బలక్ష్మి పురస్కార్‌ను పంతుల రమకు అందజేస్తారు. 1న 'డాక్టర్ ద్వారం వెంకటస్వామినాయుడు పురస్కార్'ను శ్రీరామశర్మకు ఇస్తారు. కార్యక్రమంలో విశాఖమ్యూజిక్ అకాడమీ అధ్యక్షుడు ఎ.ప్రసన్నకుమార్, ఉపాధ్యక్షులు సిహెచ్.సత్యానంద్, కార్యదర్శి ఎం.ఎస్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
వ్యాఖ్యలను పోస్ట్ చేయి (Atom)
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి