సినిమావారధి: రామ్చరణ్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'ఆరెంజ్'. జెనీలియా నాయిక. భాస్కర్ దర్శకత్వం వహించారు. నాగబాబు నిర్మాత. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకొంటోంది. చిత్రాన్ని ఈ నెల 26న విడుదల చేస్తారు. ప్రపంచంలోని ప్రేమికులంతా ఏకమైనా - తన ప్రేమ ముందు నిలువలేరు, గెలవలేరు అని గర్వంగా ప్రకటించే ప్రేమికుడతను. ప్రేమంటే గ్రీటింగు కార్డులు, కవిత్వంతో నింపుకొన్న మాటలే కాదు - ప్రేమంటే ఓ నిజం అని నమ్ముతాడు. ఇంతకీ ఆ నిజం ఏమిటి? ఈ అల్లరి ప్రేమికుడి ఆలోచనలు కథని ఎన్ని విధాలుగా మలుపు తిప్పాయి? ఇలాంటి విషయాలు 'ఆరెంజ్' చూసి తెలుసుకోవల్సిందే అంటున్నారు నిర్మాత నాగబాబు. ''చరణ్ స్త్టెల్, అతని మాట తీరు, నటన అన్నీ కొత్తగా ఉంటాయి. చరణ్ చేసిన స్కై డైవ్ సాహసాలు అబ్బురపరుస్తాయి. నిర్మాణపరంగా ఎక్కడా వెనుకడుగు వేయలేదు. కేవలం చరణ్ కోసమే ఇంత డబ్బు ఖర్చుపెట్టలేదు. కథ స్ఫూర్తినిచ్చింది. కొన్ని సినిమాలు బాగుంటాయి. కానీ మన స్పందన అంతా ఆ థియేటర్ వరకే పరిమితం. బయటకొచ్చాక మర్చిపోతాం. 'ఆరెంజ్' అలా కాదు. కొన్ని రోజులైనా మిమ్మల్ని వెంటాడుతుంది. ఆ ప్రేమలోని నిజాయతీ మీ అందరికీ నచ్చుతుంది. భాస్కర్ ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా మలిచాడ''న్నారు. సంగీతం: హారిస్ జైరాజ్.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి