Loading...

15, నవంబర్ 2010, సోమవారం

కర్రపెండలం మొక్కకు 30 కేజీల దుంపలు

విశాఖపట్నం: కె.కోటపాడు మండలంలో ఒక కర్రపెండలం మొక్క నుంచి 30 కేజీల దుంపల దిగుబడి వచ్చింది. సహజంగా ఒక మొక్కకు రెండు లేక మూడు కేజీల దుంపలు వస్తాయి. ఈ మొక్కకు 30 కేజీలు దుంపలు రావడం విశేషం. ఒక్కొక్క దుంప సుమారు మూడు అడుగుల పొడవుంది. ఈ మొక్క నాటి ఆరు నెలలవుతోందని రైతు దీవి చిన్ని తెలిపారు. 20 సంవత్సరాల నుంచి ఒకటి లేక రెండు ఎకరాల్లో కర్రపెండలం తోట వేస్తున్నానని, ఇన్ని దుంపలు రావడం ఎప్పుడూ చూడలేదని చెప్పారు. గ్రామస్తులు దాన్ని చూసేందుకు ఎగబడుతున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి