25, నవంబర్ 2010, గురువారం
నెలకు రూ.70 లక్షల కరెంట్బిల్లు
ముంబయి: ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ ఇల్లు కూడా ప్రపంచంలోనే విలువైన ఇళ్లలో ఒకటిగా నిలిచింది. అత్యంత ధనవంతులకు కూడా ఆయనలాంటి భారీ భవంతి లేదనే ప్రశంసలు పొందింది. తాజాగా ఆయన స్వగృహం 'ఆంటిలియా' మరోసారి వార్తల్లో నిలిచింది. ఆ ఇంటిలోకి ముఖేష్అంబానీ గృహప్రవేశం చేసిన ఒక్క నెలలో అయిన కరెంటుబిల్లు ఎంతో తెలుసా రూ.70,69,488. సెప్టెంబర్ నెలకుగాను ఆ ఇంటికి ఆ బిల్లు వచ్చింది. 6,37,240 యూనిట్ల విద్యుత్‌ను ఆ ఇంట్లో ఉపయోగించారు. నెలనెలా రెగ్యులర్‌గా బిల్లులు కడతారనే కారణంతో ముఖేష్‌కు విద్యుత్‌శాఖ ఆ బిల్లులో 48,354 రూపాయల రాయితీ ఇచ్చింది. అయినాసరే ముఖేష్ కుటుంబం బిల్లు 7వేల ఇళ్ల సగటు బిల్లుతో సమానం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
వ్యాఖ్యలను పోస్ట్ చేయి (Atom)
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి