Loading...

7, నవంబర్ 2010, ఆదివారం

గ్రామస్థులతో ఒబామా వీడియో కాన్ఫరెన్స్‌

ముంబయి : రాజస్థాన్‌లోని అజ్మీర్‌ సమీపంలోని కాన్పూర గ్రామస్థులతో అమెరికా అధ్యక్షుడు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. గ్రామీణ భారతంలో ఐటీ రంగం చేస్తున్న సేవల గురించి ఆయన ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. మొదట జాతీయ విజ్ఞాన కమిషన్‌ అధ్యక్షుడు శాంపిట్రోడా ఐటీ రంగం పురోగతిని ఒబామాకు వివరించారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కాన్పూర గ్రామస్థులతో మాట్లాడారు. విద్య, వైద్యం, స్థానిక ఈ-పాలన... తదితర విధానాల వల్ల ఎలా ప్రయోజనం పొందుతున్నారో తెలుసుకున్నారు. భారతదేశంలో బ్రాడ్‌బ్యాండ్‌ విప్లవం వల్ల గ్రామీణ భారతానికి అందుతున్న సేవలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. కాన్పూర గ్రామంలో కేంద్ర ఐటీ సర్వీసుల సహాయమంత్రి సచిన్‌ పైలెట్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఐటీ ఆధారిత సేవలతో గ్రామీణ భారతంలో మారుతున్న జీవనశైలిని కూడా ఆయన ఒబామాకు తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి