
పరవాడ, చైతన్యవారధి: ఎన్టీపీసీ 35వ వ్యవస్థాపక వేడుకలు ఆదివారం దీపాంజలినగర్ స్పోర్ట్స్ కాంప్లెక్సు ఆవరణలో ఘనంగా జరిగాయి. ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు, విద్యార్థులు సాగరిక రిక్రియేషన్ క్లబ్ నుంచి ర్యాలీ నిర్వహించారు. సంస్థ ఇన్‌ఛార్జి జనరల్ మేనేజర్ డి.కె.సూద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఎన్టీపీసీ పతాకాన్ని ఎగురవేశారు. సిఐఎస్ఎఫ్ సిబ్బందిచే గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సూద్ మాట్లాడుతూ 1975లో ఆవిర్భవించిన ఎన్టీపీసీ ఈ 35 ఏళ్ల కాలంలో 32,694 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తిచేసే స్థాయి ఎదిగిందన్నారు. 2017 నాటికి 75వేల మెగావాట్ల లక్ష్యంగా పయనిస్తోందన్నారు. ఈ ప్రగతి పయనంలో దేశంలోని ప్లాంట్లన్నింటికన్నా సింహాద్రి ముందు ఉందన్నారు. ఇది ఇప్పటివరకు 4,861 మిలియన్ల యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి సాధించిందన్నారు. ఇక విస్తరణలో భాగంగా మూడో యూనిట్‌ను వచ్చే మార్చి నెలలో, నాల్లో యూనిట్‌ను 2011-12 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభంచడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. సామాజిక బాధ్యతా కార్యక్రమంలో భాగంగా 16 గ్రామాలకు మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. సాయంత్రం శకుంతల ఆడిటోరియంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రాజెక్టు మేనేజర్ పి.ఎస్.రాధాకృష్ణన్, దీపికా లేడీస్ క్లబ్ అధ్యక్షురాలు రేఖా సూద్ పాల్గొన్నారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి