Loading...

9, నవంబర్ 2010, మంగళవారం

బాబు నిక్కర్లు వేసుకున్నప్పుడే రాజకీయాల్లో ఉన్నా: సీఎం

హైదరాబాద్‌: తన గురించి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పదేపదే అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి రోశయ్య మండిపడ్డారు. బాబు నిక్కర్లు వేసుకున్నప్పుడే తాను రాజకీయాల్లో ఉన్నానని తనకు ఆయన పాఠాలు అవసరం లేదని అన్నారు. తనను గల్లాపెట్టె సర్దుకోవాలని, కిరాణదుకాణం పెట్టాడని, జాక్‌పాట్‌ కొట్టాడని వ్యాఖ్యలు చేసినా పోనీ అని వూరుకున్నానని చివరకు తాను అవినీతికి అండదండలు ఇస్తున్నానని అనటం ఆయన సంస్కారలేమిని సూచిస్తోందని అన్నారు. చంద్రబాబు ఒప్పుకుంటే తన ఆస్తులు, బాబు ఆస్తులపై న్యాయవిచారణకు ఆదేశిస్తానని అందుకు సిద్ధమేనా అని సవాలు చేశారు. తాను ముఠాలు కట్టి ఎవర్నో కుర్చీలోంచి లాగి, వెన్నుపోటు పొడిచి సీఎం కాలేదని వై.ఎస్‌ అకాలమృతి అనంతరం బాధ్యతలు నిర్వర్తించమని అధిష్ఠానం ఆదేశిస్తే ఉన్నానని అన్నారు. తాను ఓ సైనికుడిగా అధిష్ఠానం ఆదేశాలను శిరసావహిస్తున్నానని అన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి