Loading...

10, నవంబర్ 2010, బుధవారం

తీరం పొడవునా అల్పపీడన ద్రోణి

విశాఖపట్నం: తమిళనాడులోని చెన్నై నుంచి ఉత్తర కోస్తా వరకూ కోస్తాంధ్ర తీరం పొడవునా మంగళవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడినట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు ప్రకటించారు. దాని ప్రభావంతో బుధవారం రాత్రి వరకూ కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో కొన్నిచోట్ల, తెలంగాణలో అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లుల నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. 'జల్‌' తుపాను బలహీనపడి పశ్చిమ వాయవ్య దిశగా కదిలి మంగళవారం ఉదయానికి తూర్పు మధ్య అరేబియా సముద్రంలోకి చేరినట్లు వివరించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి