21, నవంబర్ 2010, ఆదివారం
గ్రంథాలయాలు ఏర్పాటుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలి
అచ్యుతాపురం : గ్రామాల్లో గ్రంథాలయాలు ఏర్పాటుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు కోరారు. గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి కన్నబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా గ్రంథాలయ సంస్థకు రూ.50 కోట్లతో బిఒటి పద్ధతిలో భవన నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. కీర్తిశేషులు వైఎస్ఆర్ గ్రంథాలయాలకు అధిక ప్రాముఖ్యత ఇచ్చేవారని గుర్తు చేశారు. పలు సేవలు అందిస్తున్న అభిజిత్ పౌండేషన్‌ను ఆయన అభినందించారు. సెజ్‌లో నెలకొల్పిన మిగిలిన పరిశ్రమలు గ్రామీణ ప్రజలకు సేవలందించాలన్నారు. మండలాధ్యక్షులు వడిసెల శ్రీనివాసరావు మట్లాడుతూ, గ్రంథాలయాల ద్వారా మేధాశక్తి పెంపొందుతుందన్నారు. అభిజిత్ పౌండేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎ.రామకృష్ణ, ఎమ్డీవో ఎస్.మంజులావాణి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోన లచ్చన్నాయుడు, సర్పంచులు భీముని వెంకటేశ్వరరావు, కూండ్రపు సత్యనారాయణ, లాలం రాము, చేపల వెంకటరమణ, కె బాబ్జీ, అభిజిత్ పౌండేషన్ మానవనరుల శాఖ ప్రతినిధి అప్పలనాయుడు పాల్గొన్నారు. ఇటీవల విద్యార్థులకు నిర్వహించిన వ్యాచరచన, చదరంగం, చిత్రలేఖనం, పాటలు, ముగ్గులు, వక్తృత్వ పోటీల్లో విజేతలకు ఎమ్మెల్యే కన్నబాబు చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయాధికారి బి నాగేశ్వరరావు తెలిపారు.
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom)
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి