-అదనపు జాయంట్ కలక్టరు ఎస్.సత్యనారాయణ
విశాఖపట్నం, నవంబర్ 10: ఈ నెల 28 వ తేది నుండి డిశంబరు 4 వ తేది వరకు విశాఖపట్నంలో నిర్వహించే జాతీయ సమైక్యతా శిబిరాన్ని ఘనంగా నిర్వహించాలని అదనపు జాయింట్ కలక్టరు ఎస్ .సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. బుదవారం ఆయన చాంబరులో జరిగిన జాతీయ సమైక్యతా శిబిరం సలహామండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలోని వివిధరాష్ట్రాలనుండి 150 మంది యువతీ యువకులు పాల్గొంటారని చెప్పారు . చత్తీష్ ఘడ్ రాష్ట్రం- బస్తరు, జమ్మూకాశ్మీర్- శ్రీనగర్, జార్ఖండ్- తూర్పుసింగ్భ్ , ఒరిస్సా- బొలంగీర్, పశ్చిమబెంగాల్ - మిడ్నాపూర్ జిల్లాల నుండి మన రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన యువత పాల్గొంటారన్నారు. భారత దేశంలో నెలకొన్న వివిధ సంస్కృతులు, సాంప్రదాయాలను గూర్చి యువతకు తెలియజేస్తూ వారిలో జాతీయ సమైక్యతను పెంపొందించేందుకు ఈ శిభిరం నిర్వహిస్తున్నామన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమాన్ని ఎటువంటి లోపాలు లేకుండా నిర్వహించాలన్నారు. జాతీయ సమైక్యతను తెలియజేసే చాయా చిత్ర ప్రదర్శన సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేయాలన్నారు. జాతీయ సమైక్యత పై ప్రతి రోజు ప్రముఖుల ఉపన్యాసాలు ఏర్పాటుచేయాలన్నారు. ఈ శిబిరంలో ఉదయం యోగా, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ శిబిరంలో భాగంగా 29 వ తేదిన బీచ్ రోడ్డులో ర్యాలీ నిర్వహించాలన్నారు. ఈ ర్యాలీలో వివిధ కళాశాలకు చెందిన ఎన్ ఎస్ ఎస్ కార్యకర్తలు కూడా పాల్గోనేటట్లు చూడాలన్నారు. ఈ కార్యక్రమాన్ని నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్, ఫీల్డ్ పబ్లి సిటీ అధికారి, జిల్లా పౌర సంబంధాల అధికారుల సమన్వయంతో నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా యూత్ కో ఆర్డినేటర్ అప్పలనాయుడు, పిడి యుసిడి రమణ మూర్తి, జిల్లా క్రీడాభివృద్ది అధికారి అప్పన్న, జాతీయ యువజన అవార్డు గ్రహీత ఆర్.రవికుమార్, ఆర్.టి.సి , వైద్య శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి