21, నవంబర్ 2010, ఆదివారం
పోలవరం డిజైన్‌పై విమర్శలు తగవు
విశాఖపట్నం, నవంవర్ 21(చైతన్యవారధి): పోలవరం ప్రాజెక్టుపై, ముఖ్యంగా నీటిపారుదల ఇంజినీర్లపై కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని ఉత్తరాంధ్ర నీటిపారుదలశాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల సంఘం ఖండించింది. ఏలేరు అథితిగృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో విశ్రాంత చీఫ్ ఇంజినీర్ సత్యనారాయణ మాట్లాడుతూ కోస్తాంధ్రలోని 7జిల్లాలు, పలు తెలంగాణ ప్రాంతాలకు జీవధారగా ఉపయోగపడనున్న పోలవరం ప్రాజెక్టుపై రాజకీయనాయకులు విమర్శలు చేయడం తగదన్నారు. గత 40 ఏళ్లనుంచి వివిధ దశలలో దీని నిర్మాణాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో ఎంతోమంది నిపుణులచే ఆమోదించడం జరిగిందన్నారు. పలువురు డిప్యూటీ ఇంజినీర్లు మాట్లాడుతూ పాల్వాయి వ్యాఖ్యలు ఇంజినీర్లను మనస్తాపానికి గురిచేసేవిధంగా ఉన్నాయన్నారు. ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు కాశీవిశ్వేశ్వరరావు, ఎం.టి. రాజు, కె.సుబ్బరాజు, జి.ఎస్.నాయుడు, ఎం.శ్రీనివాస్, మూడు జిల్లాలకు చెందిన డీఈ, జేఈలు, ఇతర ఇంజినీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
వ్యాఖ్యలను పోస్ట్ చేయి (Atom)
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి