Loading...

24, నవంబర్ 2010, బుధవారం

నేడు బీహార్‌ ఓట్ల లెక్కింపు

పాట్నా: బీహార్‌ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రతను ఏర్పరిచారు. 243 శాసనసభ స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్లతో బాటు ఉపఎన్నిక జరిగిన బాంక పార్లమెంటు నియోజకవర్గ ఓట్లను లెక్కించనున్నామని అదనపు ముఖ్య ఎన్నికల అధికారి కుమార్‌ అన్షుమాలి వెల్లడించారు. మొత్తం 42 ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి వద్ద కేంద్ర పారామిలటరీ దళాలను మోహరించారు. మధ్యాహ్నానికి ఫలితాల సరళి తెలిసే అవకాశం ఉంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి