26, నవంబర్ 2010, శుక్రవారం
జగన్‌తో భేటీ అయిన పలువురు ఎమ్మెల్యేలు
హైదరాబాద్: బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చిన కడప ఎంపీ వైఎస్ జగన్‌ను పలువురు ఎమ్మెల్యేలు పరామర్శించారు. జగన్ స్వగృహంలో ఎమ్మెల్యేలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, శివప్రసాద్‌రెడ్డి, రామచంద్రారెడ్డి తదితరులు భేటీ అయ్యారు. గత కొద్దిరోజులుగా భుజం నొప్పితో బాధపడుతున్న జగన్‌ను పరామర్శించేందుకు వచ్చామని రాజకీయ చర్చలు జరగలేదని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. అయితే కొత్త ముఖ్యమంత్రి ఎంపిక, భవిష్యత్తు కార్యాచరణపై జగన్‌తో ఎమ్మెల్యేలు చర్చించినట్లు సమాచారం. మరోవైపు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకొని కాబోయే సీఎం జగన్ అంటూ నినాదాలు చేశారు. జగన్ వర్గాన్ని అణిచే ప్రయత్నం జరగదని ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి అభిప్రాయపడగా, మంత్రి పదవులు తాము ఆశించడం లేదని బాలినేని వ్యాఖ్యానించారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
వ్యాఖ్యలను పోస్ట్ చేయి (Atom)
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి