19, నవంబర్ 2010, శుక్రవారం
బ్రిటన్ ఇమిగ్రేషన్ నిబంధనలు కఠినతరం
లండన్: బ్రిటన్లో ఉద్యోగాలు, చదువుల నిమిత్తం రావాలనుకునే భారతీయులకు సంబంధించిన ఇమిగ్రేషన్ నిబంధనలు మరింత కఠినతరమయ్యే అవకాశాలున్నాయి. 'మైగ్రేషన్ అడ్వయిజరీ కమిటీ'(ఎంఏసీ) బ్రిటన్ సర్కారుకు ఈ మేరకు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఏటా ఇక్కడికి వచ్చే ఐరోపాయేతర దేశాల వారి సంఖ్యను దాదాపు 25 శాతం దాకా తగ్గించాల్సిందిగా ఎంఏసీ సిఫారసు చేసింది. ఏటా వేలాదిగా వచ్చేస్తున్న వీరి సంఖ్యను పరిమితం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది.ఏప్రిల్ 2011 నుంచి 2012 ఏప్రిల్ వరకూ ఇక్కడకు వచ్చే ఐరోపాయేతర దేశస్థుల సంఖ్యను 12,600 నుంచి 6,300లకు తగ్గించాలని గట్టిగా సిఫారసు చేసింది. అంటే వచ్చే ఏడాదిలో 13 నుంచి 25 శాతం దాకా తగ్గింపు తప్పనిసరి కావచ్చని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 2011 ఏప్రిల్నుంచీ ఇక్కడకొచ్చే ఐరోపాయేతర దేశాల వారి సంఖ్యను తగ్గించేయాలన్న బ్రిటన్ హోంమంత్రి థెరెసా మే నిర్ణయం నేపథ్యంలో ఏంఏసీ సిఫారసులకు ఆమోదం సులువుగా లభించవచ్చని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
వ్యాఖ్యలను పోస్ట్ చేయి (Atom)
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి