Loading...

20, నవంబర్ 2010, శనివారం

రాష్ట్ర గనుల శాఖకు అటవీ శాఖ నోటీసులు

హైదరాబాద్‌: డి బీర్‌ సంస్థకు తవ్వకాలకు అనుమతిస్తూ గనుల శాఖ ఇచ్చిన ఉత్తర్వులపై అటవీశాఖ నోటీసులు జారీ చేసింది. తమ ముందస్తు అనుమతి లేకుండా ఈ మైనింగ్‌ ఉత్తర్వులు ఎలా ఇచ్చారంటూ గనులశాఖను ప్రశ్నించింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో డి బీర్‌ సంస్థకు కేటాయించిన భూములలో పది శాతం అటవీ భూములేనంటూ ఆరోపణలు వెల్లువెత్తడంతో అటవీ శాఖ స్పందించక తప్పలేదు. తాము జరిపిన సర్వేలో కేవలం రెండున్నర శాతం మాత్రమే అటవీ భూములున్నట్లు తేలిందని అటవీ పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. తమ అనుమతి లేకుండా ఎలా భూములలో మైనింగ్‌కు ఆదేశాలిచ్చారని రాష్ట్ర గనుల శాఖను ప్రశ్నించినట్లు మంత్రి తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి