
తిరుపతి: తిరుమల శ్రీవారి నూతన సంవత్సర క్యాలెండర్లను టీటీడీ గురువారం విడుదల చేసింది. ఈఓ కృష్ణారావు వీటిని విడుదల చేశారు. శ్రీవారి స్పైరల్బౌండ్ క్యాలెండర్లకు దేశవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉందని అందుకే ఈసారి ముందుగానే క్యాలెండర్లను విడుదల చేస్తున్నామని చెప్పారు. సుమారు 10 లక్షల క్యాలెండర్లను అందుబాటులో ఉంచుతున్నట్లు ఈఓ తెలిపారు. గతంలో ఈ క్యాలెండర్ ధర 65 రూపాయలు కాగా ఈసారి 75 రూపాయలు చేశారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి