19, నవంబర్ 2010, శుక్రవారం
కాంగ్రెస్ చరిత్ర త్యాగాలమయం : సీఎం
గుంటూరు: ముఖ్యమంత్రి రోశయ్య ఈరోజు గుంటూరులో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హైదరాబాద్‌నుంచి హెలికాప్టర్లో గుంటూరు వచ్చిన ఆయన మొదట పెదకాకానిలోని మల్లేశ్వరస్వామి ఆలయంలో కోటిన్నర రూపాయల ఖర్చుతో నిర్మించిన శ్రీదుర్గా సదనాన్ని ప్రారంభించారు. సతీసమేతంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటుచేసిన కాంగ్రెస్ 125వ ఆవిర్భావ ఉత్సవాల ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు. ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. జిల్లాకు చెందిన ముగ్గురు స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ చరిత్ర అంతా త్యాగాలమయమని అన్నారు. కాంగ్రెస్ నేతల స్నేహం ఎక్కువగా పేదలతోనేనని ఆయన అన్నారు. అనంతరం బృందావన్ గార్డెన్స్ కూడలివద్ద ఆచార్య ఎన్జీ రంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. నగరంలో న్యాయవాదుల ఆందోళన, విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో భారీగా పోలీసు బలగాలను మొహరించారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
వ్యాఖ్యలను పోస్ట్ చేయి (Atom)
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి