
విశాఖపట్నం: కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలకు రాట ఉత్సవంతో అంకురార్పణ జరిగింది. డిసెంబరు 6 నుంచి జనవరి 4వ తేదీ వరకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. బుధవారం దేవస్థానం ఆవరణలో జరిగిన రాట ఉత్సవం వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా చేశారు. వేద మంత్రాలు, మంగళవాయిద్యాలతో గణపతి పూజ, వాస్తుపూజ జరిపారు. అనంతరం అమ్మవారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. దీంతో అమ్మవారి ఉత్సవ ఏర్పాట్లకు శ్రీకారం చుట్టినట్లయింది. కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణ అధికారి డి.భ్రమరాంబ, పాలక మండలి ఛైర్మన్ కె.తాతారావు, ట్రస్టీలు వడ్డాది పద్మావతి, కాళ్ల సూర్యప్రకాశరావు, రామోజు బద్రాచారి, వెంకటవిజయ్, కె.వెంకట నర్సింహారావు, గుడివాడ శ్రీనివాసరావు, పి.గంగాభవాని, వంకాయల రాంగోపాల్, తదితరులు పాల్గొన్నారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి