Loading...

21, నవంబర్ 2010, ఆదివారం

అంబికాబాగ్‌'ను వదులుకునే ప్రసక్తే లేదు

-ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్‌
విశాఖపట్నం, నవంవర్ 21(చైతన్యవారధి): అంబికాబాగ్‌ స్థలాన్ని ఎట్టి పరిస్థితిలోను వదులుకొనే ప్రసక్తే లేదని, కనకమహలక్ష్మి దేవస్థానం అధికారులు చేసిన ప్రతిపాదనల ప్రకారమే అక్కడ రామాలయ నిర్మాణం చేపడతామని దక్షిణ నియోజకర్గ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. దేవస్థానం అధికారులు, ట్రస్టుబోర్డు పాలకవర్గ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే అంబికాబాగ్‌ స్థలాన్ని పరిశీలించారు. కనకమహలక్ష్మి దేవస్థానం ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు చేసిన ప్రతిపాదనలపై అధికారులు, పాలక మండలి సభ్యులతో ఎమ్మెల్యే చర్చించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ అత్యంత విలువైన స్థలాన్ని దాత ఆశయానికి విరుద్ధంగా ఎట్టి పరిస్థితిలోను ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇచ్చే ప్రశ్నేలేదన్నారు. ఈ విషయమై దేవాదాయ శాఖ కమిషనర్‌, ఇతర సీనియర్‌ అధికారులు, మంత్రి గాదె వెంకటరెడ్డితో తాను మాట్లాడుతున్నానని, సీఎం దృష్టికి అన్ని అంశాలను లేఖరూపంలో పంపుతున్నామని చెప్పారు. ఆ స్థలంలో భద్రాది తరహాలో ఆలయంతో పాటు, అత్యాధునిక వసతులతో కణ్యాణ మండప నిర్మాణాన్ని చేపడతామన్నారు. లీజ్‌ కోసం చేసిన దరఖాస్తును స్థానికంగా ఉన్న అధికారులు తిరస్కరించినందున మళ్లీ ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నమే జరగబోదని, ఈ విషయంలో తాను అన్ని చర్యలను తీసుకుంటానని వివరించారు. దేవస్థానం కార్యనిర్వహణ అధికారి డి.భ్రమరాంబ, ట్రస్టుబోర్డు ఛైర్మన్‌ కె.తాతారావు, ట్రస్టీలు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి