Loading...

21, నవంబర్ 2010, ఆదివారం

గుండెకు సంబంధించిన వ్యాధులపై వైద్య శిబిరం

అనకావల్లి, నవంబర్ 21 (చైతన్యవారధి): గుండెకు సంబంధించిన వ్యాధులపై పట్టణంలోని చిన్నవీధిలో ఉన్న నుదురుపాటి వరహాలు కల్యాణమండపంలో వైద్యశిబిరాన్ని  ఆదివారం నిర్వహించారు. లయన్స్‌ క్లబ్‌  ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో విశాఖపట్నం సెవెన్‌హిల్స్‌ ఆసుపత్రి  గుండె వైద్య నిపుణులు డాక్టర్‌ లింగరాజ్‌నాధ్‌ వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో  లయన్స్‌ క్లబ్‌  అధ్యక్షులు ఎస్‌.కల్యాణ్‌కుమార్‌, ఇతర సభ్యులు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి