21, నవంబర్ 2010, ఆదివారం
ట్రాన్స్కో ఉద్యోగిపై ఫ్రిర్యాదు
అనకాపల్లి, నవంబర్ 21(చైతన్యవారధి): వ్యవసాయ కనెక్షన్ కోసం ట్రాన్స్కో చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోవడంతో వినియోగదారుడు ఉన్నతాధికారులను ఆశ్రయించారు. ఆమ్యామ్యాల కోసం కుంటి సాకులతో తనను వేధిస్తున్నారని ఆరోపించడంతో దర్యాప్తు జరుగుతోంది. బాధితుడు రాజకీయ నేత కావడంతో వాతావరణం మరిం త వేడెక్కింది. మూడు నెలల క్రితం ఒక విని యోగదారుడు వెళ్లి వ్యవసాయ కనెక్షన్ ఇప్పించమని కోరాడు. సదరు ట్రాన్స్కో ఉద్యోగి వినియోగదారుడ్ని కొద్ది రోజులు తిప్పించి చివరికి బేరసారాలు ఆడడం ప్రారంభించాడు. అధికార పార్టీకి చెందిన నాయకుడు కావడంతో సదరు వినియోగదారుడు మాలాంటి నాయకుల వద్ద నుంచి కూడా ఆమ్యామ్యాలు అడుగుతారా అని ప్రశ్నించాడు. దీనికి ట్రాన్స్కో ఉద్యో గి సమాధానమిస్తూ నాకు మంత్రుల అండదండలున్నాయి. నేను కూడా బీసీ ఉద్యోగినేనని సమాధానం చెప్పి అధికార పార్టీ నాయకుడికి ఝలక్ ఇచ్చాడు. లోవోల్టేజి సాకు చూపి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని లేకుంటే కనీసం తగిన పారితోషికం అందించాలని చెప్పడంతో వినియోగదారుడు అక్కడి నుంచి వెనుదిరి గారు. ట్రాన్స్కో ఉద్యోగిపై ఇతర ఆరోపణలను సైతం సేకరించి, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ట్రాన్స్కో విజిలెన్స్ బృందం రంగంలోకి దిగి అన్ని ఆరోపణలపై ఆరా తీస్తున్నారు. బాధితుల నుంచి రాతపూర్వకమైన ఫిర్యాదులు తీసుకున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
వ్యాఖ్యలను పోస్ట్ చేయి (Atom)
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి