హైదరాబాద్ : సంగారెడ్డి పర్యటనను ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రోశయ్య క్యాంపు కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. హోంమంత్రి సబితాఇంద్రారెడ్డి, డీజీపీ అరవిందరావు, నగర పోలీసు కమిషనర్ ఏకే ఖాన్‌లతో రాష్ట్రంలోని శాంతిభద్రతలపై సమీక్షించారు. ఎస్సై రాతపరీక్షలు వాయిదా వేయాలంటూ హైదరాబాద్‌తోపాటు తెలంగాణ ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న ఆందోళనలను డీజీపీ సీఎంకు వివరించారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి